పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి అఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత సినిమ ప్రేక్షకుల ముందుకు ‘రాధే శ్యామ్’ సినిమాతో వచ్చాడు పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘పాజెక్ట్ k’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇంకా హిట్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దరర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాల్సి ఉంది. మంచి దూకుడుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పెద్ద చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు.ప్రస్తుతం ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఫికైయ్యాడని కూడా తాజా ఇండస్ట్రీలో విన్పిస్తోన్న సమాచారం. తాజాగా వచ్చిన ‘రాధే శ్యామ్’ సినిమాకు నేపథ్య సంగీతం అందించిన మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్.. ప్రభాస్ – మారుతి సినిమాకు సంగీతం అందించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారక ప్రకటన కూడా రాబోతున్నట్టు సమాచారం.