తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్లాన్ వేసిన నిందితులను పట్టుకోని విచారిస్తున్నారు.
ఈ క్రమంలో వ్యక్తిగత కక్షలు,ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణం అని పోలీసులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో సైబరాబాద్ లోని షేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలో భాగంగా మూడో రోజు మున్నూరు రవి ,మధుసూదన్ రాజుని ప్రశ్నించారు.
చివరి రోజు అయిన ఈరోజు శనివారం సైబరాబాద్ పోలీసులు కీలక విచారణ చేపట్టే అవకాశం ఉంది.ప్రధాన నిందితుడు రాఘవేంద్రరాజుతో పాటు మరో ఇద్దర్ని ఒకేచోట కూర్చుబెట్టి మరి విచారించనున్నట్లు తెలుస్తుంది.