తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాలు 92నుండి 56కు తగ్గించాము. దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాము.
ఇందులో కేసీఆర్ కిట్లు అత్యంత కీలక పాత్ర పోషించింది. అమ్మఒడి వాహనాలు,ఆరోగ్య లక్ష్మీ వంటి పథకాల వల్ల కూడా రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు,ప్రజల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఈవిజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్క వైద్య సిబ్బంధికి అభినందనలు తెలిపారు .ఇలాంటి మైళ్ల రాళ్లు మరిన్ని అధిగమించేలా మనమంతా కల్సి పనిచేయాలి. ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేసేలా ఉండాలని మంత్త్రి హారీష్ రావు తెలిపారు.