తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి చెందిన నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు రెబల్‌గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్రంగా ఖండించారు.