హైదరాబాద్: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్‌యాదవ్ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్ ఇక్కడ దృష్టి పెట్టినా ఉపయోగం ఉండదని.. యూపీ లాంటి ఫలితాలు తెలంగాణలో రావని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్‌ను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. తన లోక్‌సభ నియోజకవర్గ పరధిలో అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రితో డిస్కస్ చేసినట్లు ఆయన తెలిపారు.