దేశమంతటా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో యూపీలో ఉన్న మొత్తం 403అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 273సీట్లు.. సమాజ్ వాదీ కూటమి 125సీట్లు.. ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్నిదక్కించుకోకపోయిన.. ఎక్కువ స్థానాలను గెలవకపోయిన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
రాష్ట్రంలోని రాంపుర్ ఖాస్ నియోజకవర్గం నుండి ఒకే కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గత నలబై రెండు ఏండ్లుగా విజయం సాదిస్తున్నారు. 1980లో మొదలైన ఈ విజయ ప్రస్థానం గత నలబై రెండేండ్లుగా రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని దక్కించుకున్న కానీ రాంపుర్ ఖాస్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రమోద్ తివారీ కుటుంబమే గెలుస్తుంది.1980లో తొలిసారి అక్కడ నుండి ప్రమోద్ తివారీ కాంగ్రెస్ టికెట్ పై 1985,89,91,93,96,2002,2007,2012లలో జరిగిన అని సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే 2013లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ఆరాధనా మిశ్ర పోటిలోకి దిగి ఘన విజయం సాధించారు. అయితే ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించి తాజా ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిపై గెలుపొంది తమకు ఎదురుతిరుగులేదని నిరూపించుకున్నారు.