తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. కేసీఆర్ హెల్త్ బులెటిన్ గురించి ముఖ్యమంత్రి వ్యక్తిగత డాక్టర్ ఎంవీరావు నేతృత్వంలోని వైద్య బృందం మీడియాతో మాట్లాడారు.
ఎంవీరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు., ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని చెప్పారు. గత రెండు రోజుల నుంచి బలహీనంగా ఉన్నట్లు సీఎం చెప్పారు.
ఎడమ చేయి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు సాధారణ పరీక్షలతో పాటు ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు పేర్కొన్నారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంవీ రావు స్పష్టం చేశారు.యాంజియోగ్రామ్ టెస్ట్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎలాంటి బ్లాక్స్ లేవని డాక్టర్లు తెలిపారు.