తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఉప్పల్ నుంచి నేరుగా యశోద ఆస్పత్రికి వచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. అయితే గతరెండ్రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారు.ఎడమ చేయి లాగుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తాం.జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిచాం.సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు అని యశోద ప్రముఖ వైద్యులు డా.ఎం.వి.రావు తెలిపారు.