తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్యకు ఎమ్మెల్సీ కవిత నియామక పత్రం అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామకాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందించారని గుర్తు చేసారు.
కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న ఎమ్మెల్సీ కవిత, కార్మికుల శ్రేయస్సు టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న ఎమ్మెల్సీ కవిత, కార్మిక పక్షాన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి సంస్థను కాపాడుకుంటామని తెలిపారు