తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ప్రసంగానికి అడ్డుతగులుతున్నారు. అసెంబ్లీ వెల్ లోకి దూసుకొస్తున్నారు అని కారణంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్,ఈటల రాజేందర్,మాధవనేని రఘునందన్ రావు లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ మీటింగ్ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన సంగతి విదితమే.
ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయంలో హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకోదని.. శాసనసభ నిర్ణయాల్లో ఎలాంటి జోక్యం ఉండదు. స్టే ఇవ్వడం కుదరని తేల్చి చెప్పింది.