భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంతకుముందులాగా దుప్పట్లు,రగ్గులు అందజేయనున్నట్లు ప్రకటించింది.
నిన్న మొన్నటి వరకు ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అప్పటి వరకు ఉన్న ఈ సదుపాయాన్ని నిలిపివేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించిన ఆదేశాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లకు నిన్న గురువారం జారీ చేసింది. ప్రయాణికులకు భోజనాలు సైతం అందించనున్నారు. అయితే పలు మార్గాల్లో ప్రయాణించే వివధ వర్గాల ప్రయాణికులకు రాయితీలను మాత్రం పునరుద్ధరించలేదు.