గురువారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం అరవై స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ పార్టీ ముప్పై రెండు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఎన్ బీరేన్ సింగ్ నియామకం ఏకగ్రీవం అయినట్లు తెలుస్తుంది. మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బీరేన్ సింగ్ ముందుగా జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత రాజకీయాల్లో చేరి ఆయన అంచలంచెలుగా ఎదిగారు. 1992లో నహరోల్జి తౌడాంగ్ అనే వార్త పత్ర్రికను ప్రారంభించి దాదాపు తొమ్మిదేళ్లు అనగా 2001వరకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు. ఆ గుర్తింపుతోనే 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టారు. ముందుగా డెముక్రటిక్ రెవల్యూషనరీ పీపుల్స్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ మంత్రివర్గంలో ఆయన సభ్యుడయ్యారు.
అయితే అతి స్వల్ప కాలంలొనే ఇబోబి సింగ్ కు అత్యంత నమ్మకస్తుడైన సన్నిహితుడిగా మారారు. 2002నుండి 2016వరకు కాంగ్రెస్ పార్టీ హాయాంలో పలు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలను ఇబోబి సింగ్ నిర్వహించారు. అయితే 2016ఏడాదిలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి బీజేపీ పార్టీలో చేరారు. 2017ఎన్నికల్లో ఎన్పీపీ,ఎన్పీఎఫ్,ఎల్జేపీ,టీఎంసీల భాగస్వామ్యంతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. తాజాగా మరొకసారి ముఖ్యమంత్రి కానున్నారు.