తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు మన్మధుడు అని ముద్దుగా పిలుచుకునే అక్కినేని నాగార్జున కథనాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఘోస్ట్ . ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా నారాయణ దాస్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహాన్ రావు,శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతుంది. హీరో హీరోయిన్లు నాగార్జున ,సోనాల్ చౌహన్ లతో పాటుగా ఇతర తారాగణం పై చిత్రీకరణ జరుగుతుంది. సుధీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో అత్యంత కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించినట్లు ది ఘోస్ట్ చిత్రం యూనిట్ తెలిపింది.ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో పెట్టింది చిత్రం యూనిట్.
నాగ్ ప్రధానపాత్రలో నటిస్తుండగా ప్రవీణ్ సత్తారు తనదైన శైలీలో మంచి థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ముఖేష్ ,యాక్షన్ రాబిన్ సుబ్బు ,నభా,కళ బ్రహ్మకడలి వ్యవహరిస్తున్నారు.