ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేనో తారీఖున వైఎస్సార్సీఎల్పీ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
