తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం అనేక వైద్య పరీక్షలు నిర్వహించి సీఎం కేసీఆర్ ఆరోగ్య బాగుంది.
అన్ని పరీక్షల్లో ఫలితాలు నార్మల్ గా ఉన్నాయి. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిదని మీడియాతో మాట్లాడిన సమావేశంలో తెలిపిన సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ ట్వీట్ చేశారు.
ట్వీట్టర్ వేదికగా బండి సంజయ్ “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.