ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గురువారం విడుదలవుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఇప్పటి వరకు 69 స్థానాల నుంచి ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ-37, కాంగ్రెస్-30, ఆప్-1, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి లీడ్లోకి వచ్చారు. ఉత్తరాఖండ్లో మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది… బీజేపీ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
