గోవా ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ 5 చోట్ల లీడింగ్లో ఉంది.
దీంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా మారనుంది. దీన్ని ముందే గ్రహించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండ్రోజుల క్రితమే గోవాకు పార్టీ ముఖ్యులను పంపారు.