ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ హావా నడుస్తుంది. అయితే మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు.
రెండు రౌండ్లకుగాను అఖిలేష్‌కు 12,011 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ బగేల్‌కు 2,638 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తర్వాత బీఎస్పీ అభ్యర్థి 281 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో అఖిలేష్ యాదవ్ కు 80.09 శాతం ఓట్లు వచ్చాయి. తన సమీప బీజేపీ అభ్యర్థికి 17.59 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అఖిలేష్‌కు భారీ మెజారిటీ రావడం ఖాయమని స్పష్టంగా ఆర్ధం అవుతుంది.