ఉక్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నాటో కూటమిలో చేరడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెనక్కి తగ్గారు. నాటోలో చేరాలనుకోవడం లేదని చెప్పారు. మాపై దాడి చేస్తున్న రష్యాపై నాటో దేశాలు పోరాటం చేయడం లేదన్నారు.
స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపైనా రాజీ పడినట్లు తెలిపారు. రష్యా కూడా ఉక్రెయిన్ నుంచి ఇదే ఆశిస్తోంది. నాటోలో చేరొద్దని ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. తాజా ప్రకటన నేపథ్యంలో శాంతిచర్చలు ఫలించే అవకాశం ఉంది.