తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
