తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాలను మంత్రి గంగుల కమలాకర్తో కలసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు.
