తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు సోమవారం నుండి మొదలయిన సంగతి విదితమే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖమంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో … మరోక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అయితే శాసనసభలో మంత్రి తన్నీరు హారీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన అరక్షణం నుండి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,రాజాసింగ్,మాధవనేని రఘునందన్ రావు సభలో ప్రసంగానికి అడ్డు తగలడం మొదలెట్టారు.
దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ సెషన్ ముగిసేవరకు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెండ్ గురించి మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ప్రసంగం మొదలెట్టినప్పటి నుండే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వెల్ లోకి దూసుకోచ్చారు.
అందుకే వారిపై సస్పెండ్ వేటు వేశారు అని అన్నారు. వెల్ లోకి వస్తే సస్పెండ్ చేయాలని గతంలో జరిగిన బిఏసీ సమావేశంలో నిర్ణయించామని ఆయన తెలిపారు.సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ రాజ్యసభలో ప్రభుత్వాన్ని ఏదో ప్రశ్నించారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన పన్నెండు మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. ఢిల్లీలో ఒక న్యాయం. రాష్ట్రంలో ఒక న్యాయమా అని బీజేపీని ప్రశ్నించారు.