ఈ నెల పదో తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పోటిస్తుందని.. ఇంకొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కానీ ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఓటమి ఖాయమని తేల్చేసింది. అయితే ఆ సంస్థ ఏంటి. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మసాక్షి అనే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో యూపీలో బీజేపీకి ఓటమి ఖాయమని తేల్చింది. యూపీలో ఎస్పీ కూటమికి 235-240సీట్లు వస్తాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం 138-140సీట్లతో సర్దిపెట్టుకుంటుందని తేల్చి చెప్పింది.
పంజాబ్ రాష్ట్రంలో మాత్రం మళ్లీ కాంగ్రెస్ హావా నడవనున్నదని ఈ సంస్థ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 58-61సీట్లు.. ఆప్ కు 34-38సీట్లు..శిరోమణి అకాలీదళ్ కు 18-21సీట్లు… బీజేపీకి మాత్రం 4-5సీట్లు వస్తాయని తేల్చింది. ఇక ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ 43-47,బీజేపీకి 20-21సీట్లు వస్తాయని తెలిపింది.
గోవాలో కాంగ్రెస్ కు 21-22,బీజేపీకి 9-10సీట్లు వస్తాయని చెప్పింది. మణిపూర్ లో మాత్రం కాంగ్రెస్ ,బీజేపీల మధ్య హోరాహోరీ తలపడతాయని తెలిపింది. మొత్తం మీద కాంగ్రెస్ పంజాబ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఉత్తరాఖండ్,గోవాలోనూ అధికారంలోకి వస్తుంది అని ఆత్మసాక్షి అనే సంస్థ తేల్చి చెప్పింది.చూడాలి మరి ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తొందో.. లేదో.. ఓటరు దేవుళ్ళు ఏవైపు నిలబడ్డారో ఈ నెల పదో తారీఖున తేలుతుంది.