వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ గారు ఆవిష్కరించారు.
కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్‌ను కేసీఆర్ గారు కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కంటే ముందు వనపర్తి జిల్లా కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. చిట్యాలలో వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ను ప్రారంభించారు. మరికాసేపట్లో కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ గారు ప్రారంభించనున్నారు.