తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
హరీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ్నుంచి నేరుగా హరీశ్‌రావు అసెంబ్లీకి బయల్దేరనున్నారు.కోకాపేట్‌లోని తన నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని హరీశ్‌రావు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.