పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ ,అందాల బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఇంకో ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీని తర్వాత వరుసగా ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ చిత్రాలు లైన్ లో ఉన్నాయి.
ఇవి కాకుండా ప్రభాస్ మరో సినిమాకి కూడా కమిట్మెంట్ ఇచ్చినట్టు తెగ వార్తలొస్తున్నాయి. కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో చెయితిరిగిన దర్శకుడు మారుతి .. ప్రభాస్ తో ఓ ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కించబోతున్నట్టు కొద్ది రోజలుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మారుతి కథకు ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల వారి సమాచారం.
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో వార్త స్ప్రెడ్ అయింది. అదేంటంటే.. ఈ సినిమాకి ‘రాజాడీలక్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ టైటిల్ కు అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో .. మారుతి వేరే టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం.