ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూటూబ్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్‌సంగ్ (Samsung) కూడా ఆ జాబితాలో చేరింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు యుద్ధభూమి ఉక్రెయిన్‌కు 6 మిలియన్ డాలర్ల మానవతా సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.