ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74) గుండెపోటుతో మృతి చెందాడు. మార్ష్ 1970 నుంచి 84 వరకు 96 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. కీపర్ టెస్టుల్లో 355 మందిని ఔట్ చేశాడు.
అతడి రిటైర్మెంట్ వరకు ఇదే ప్రపంచ రికార్డు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ కూడా ఇతడే. కోచ్గా, కామెంటేటర్, 2014 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు.