జార్ఖండ్ రాజధాని రాంచీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు రాంచీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. మరికాసేపట్లో జార్ఖండ్ గిరిజన ఉద్యమకారుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్.. నేరుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి వెళ్లనున్నారు.
గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేయనున్నారు. రాంచీలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కూడా పాల్గొననున్నారు. గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేస్తారు.