బాసరలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, వేణుగోపాలచారి, ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..అడవుల పునరుద్ధరణ కార్యక్రమమం జరగడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. 7.7 శాతం అడవుల పునరుద్ధరణ జరిగింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డి కి ఆ ఘనత దక్కుతుంది.
బాసర జంక్షన్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం. పరిపాలన, యుద్ద నైపుణ్యం లో అన్నింటా శివాజీ ఆదర్శం. మత సామర్యాన్ని చాటారు.ప్రజలే ప్రభువులుగా పాలించారు.శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదు.. పవిత్ర స్థలాలు ధ్వంసం చేయలేదు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడంలో శివాజీ గారు స్ఫూర్తి.
అహింసా మార్గంలో 14 ఏళ్లు పోరాటం చేసి.. తెలంగాణ సాధించి.. అద్భుత పాలన అందిస్తున్నారు.అభివృద్ధిలో తెలంగాణ దేశానికి మోడల్ దేశానికి అయ్యింది. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఇక్కడి పథకాలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.స్థానిక ప్రతినిధుల కోరిక మేరకు బాసర పి హెచ్ సి కి అంబులెన్స్ మంజూరు చేస్తున్నం అని అన్నారు.