రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు రావడం కలకలం రేపింది. ఈ ఉదయం రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి “నాకు కాయిన్స్ ను ఎగరవేయడం అంటే ఇష్టం… అది నా కడుపులోకి చేరుకుంటే ఇంకా బాగుంటుంది” అని ట్వీట్ వచ్చింది.
ఈ ట్వీట్ తో ఫాలోవర్స్ షాక్ తిన్నారు. కాసేపటికే “క్రికెట్ బాల్స్ ను తినొచ్చు కదా?” అంటూ మరో ట్వీట్ రావడంతో రోహిత్ అకౌంట్ హ్యాక్ అయ్యిందేమోనని అనుమానిస్తున్నారు.