ఉత్తరప్రదేశ్ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రచారం ఉండవచ్చు. ఈ సెగ్మెంట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ వంటి నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు..తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వారితో కలిసి వెళ్తారా? లేక ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటారా? అనేది తెలియాల్సి ఉంది.