మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్(26) మృతి చెందాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది.
ఈ విషయాన్ని సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్ ద్వారా తెలియజేశారు. జైన్ పుట్టినప్పటి నుంచి సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక సెరెబ్రల్ పాల్సీతో బాధపడేవారిలో పుట్టుకతోనే మెదడు దెబ్బతిని ఉంటుంది. అందుకే బ్రెయిన్‌కు కాళ్లు, చేతులపై కంట్రోల్ ఉండదు. దీనికారణంగా వారు లేచి నడవలేరు. వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.