ఉదయాన్నే తీసుకునే మంచి అల్పాహారాల్లో పోహ కూడా ఒకటి. దీనిని తయారీ చాలా సులువు. చాలా లైట్ ఫుడ్. అటుకులను ముందుగా నీళ్లతో శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పెనం పెట్టి, నూనె పోసి వేడిచేయాలి.
జీలకర్ర, శెనగ పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు వేసి 5ని.లు కలియబెట్టాలి. ఇప్పుడు అటుకులు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి కలపాలి. పోహ రెడీ!