అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.
