తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.
ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉంది.