దేశంలో గత వారం రోజులతో పోల్చుకుంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 దిగువకు పడిపోయింది. గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా వల్ల 119 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 5,13,843 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,02,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,23,828 కరోనా పరీక్షలు చేశారు.