ఆడవాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు అనే కోణంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సాగుతుందని నటి ఖుష్బు తెలిపారు. ఆడవాళ్లకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు కిషోర్ ఈ కథ రాసుకున్నారని చెప్పారు.
ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు వినోదం చక్కగా కుదిరిందని, అందుకే కథ వినగానే చేశానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరో పాత్రకు ఐదుగురు తల్లులు ఉంటారన్నారు. తన పాత్ర ఎలా ఉంటుంది? అన్నది మూవీలో చూడాలని తెలిపారు.