లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ తనదైన ముద్రతో పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఈ రంగంలోకి ఇప్పటికి రూ.6,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలతో పాటు భవిష్యత్తులో రాబోయే కంపెనీలు కూడా తోడయితే మొత్తం 215 కంపెనీలు అవుతాయని ఆయన తెలిపారు. బయో ఆసియా 2022 సదస్సును ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
లైఫ్ సైన్స్ కంపెనీలు కేవలం ఏడాది కాలంలో 34 వేల అదనపు ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చాయని చెప్పారు. కరోనా మహమ్మారి లైఫ్ సైన్సెస్ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని, ఈ నేపథ్యంలో ఈ ఏడాది బయో ఆసియాకు ‘‘భవిష్యత్ సంసిద్ధత’’ (ఫ్యూచర్ రెడీ)పేరు పెట్టడం సముచితంగా ఉన్నదన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్‌గా నిలవనున్న హైదరాబాద్ ఫార్మా సిటీ త్వరలోనే ప్రారంభం కానున్నదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ డివై్‌సల పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తున్నదని ఆయన తెలిపారు. మెడికల్ డివై్‌సల పార్క్‌లో ఇటీవలే 7 కంపెనీలను తాను స్వయంగా ప్రారంభించానని, మరో 20 కంపెనీలు ఆరు నెలల్లో ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు.