తెలంగాణలో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీకి ప్రభుత్వం రూ.82.84 కోట్లు విడుదల చేసింది. 2021-22 రెండవ త్రైమాసికానికి ఈ నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సొసైటీ పరిధిలోనీ హైస్కూల్, జూనియర్ కాలేజీల నిర్వహణకు ఈ నిధులు వినియోగిస్తారు. 2021-22 బడ్జెట్లో సొసైటీకి ప్రభుత్వం రూ.165.68 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, మహబూబ్‌నగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్ భవనం మరమ్మత్తులు, నిర్వహణకు రూ.7.50 లక్షలు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి మరో ఉత్తర్వు జారీ చేశారు.