జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భేటీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్..
అందులో చర్చించాల్సిన అంశాలపై ఢిల్లీకి వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాల నిపుణులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.