జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లానాయక్’’ సినిమా విషయంలో ఏపీ అధికార వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ చిత్రంపై ట్వీట్టర్ వేదికగా బాబు స్పందిస్తూ… రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు.
చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో హీరోయిన్స్ నిత్యా మీనన్ ,సంయుక్త మీనన్ ,ఇతర నటులు రావు రామేష్ ,మురళి శర్మ,సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగదేవర సూర్యవంశీ నిర్మాతగా ..ఎస్ఎస్ తమన్ సంగీతం వహించగా ఈ రోజు విడుదలైన చిత్రం భీమ్లా నాయక్. ఎన్నో సార్లు విడుదల వాయిదా పడుతూ వస్తుండగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే , సంభాషణలు అందించారు.