విటమిన్”ఇ”లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖానికి కావాల్సిన తేమ అందిస్తుంది. చుండ్రు, దురద, జుట్టు త్వరగా పెరగకపోవడం వీటన్నింటికి “ఇ” విటమిన్తో చెక్ పెట్టొచ్చు.
రెండు క్యాప్సూళ్ల విటమిన్ “ఇ” నూనెను.. తలకు రాసే నూనెకు కలిపి, రాత్రి లేదా తల స్నానానికి అరగంట ముందు పట్టిస్తే ఫలితం ఉంటుంది. నిర్జీవంగా మారిన చేతి గోళ్లకు “ఇ” విటమిన్ నూనెతో మర్దన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.