రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. శ్రీలంకతో నేడు జరిగే టీ20 మ్యాచ్లో మరో 37 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో తొలి స్థానంలో, విరాట్ కోహ్లి 3,296 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు.