ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడని PTI వార్తా సంస్థ తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొంది. కాగా, గత సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ పంజాబ్ ఫ్రాంఛైజీని వదిలేశాడు.
