టీమిండియాతో టీ20 సిరీస్ ముందు శ్రీలంక జట్టులో కరోనా కలకలం రేగింది. లక్నో వేదికగా భారత్, శ్రీలంక మధ్య నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. లంక స్పిన్నర్ వనిందు హసరంగాకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 2 వారాల వ్యవధిలో హసరంగా కరోనా బారినపడటం ఇది రెండోసారి కాగా ఐపీఎల్ లో అతడిని ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
