విటమిన్ ‘సి’ ఉపయోగాలేంటి?… అసలు దానివల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..! విటమిన్ ‘సి’ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణజాలాల పెరుగుదలకు, గాయాలు మానడానికి ఉపయోగపడే అతిముఖ్యమైన సూక్ష్మపోషకం.
ముఖ్యంగా కోవిడ్-19 వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులను, కంటికి సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, స్ట్రాబెర్రీ, కివి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.