Home / SLIDER / మల్లన్నసిగలో గంగమ్మ తాండవం

మల్లన్నసిగలో గంగమ్మ తాండవం

తెలంగాణకే తలమానికంగా సీఎం శ్రీ కేసీఆర్‌ సాధించిన ఘనత.. నేడు సాక్షాత్కరించనున్నది. అదే మల్లన్నసాగరం.. తెలంగాణ నెత్తిన నీళ్ల కుండ ఎత్తినట్టు.. తలాపున గంగాళం పెట్టినట్టు.. నదిలేని చోట.. నడిగడ్డపై సముద్రాన్ని తవ్వినట్టు.. నేడే తెలంగాణ నడిబొడ్డున గంగావతరణం ఇది నదినే ఎత్తిపోసిన కాళేశ్వర ఘట్టంలో తుది అంకం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మరోపర్వం.

ఎక్కడి మేడిగడ్డ.. ఎక్కడి కొండపోచమ్మ.. ఏడేండ్ల కింద ఎట్లుండె తెలంగాణ.. ఇప్పుడెట్లయ్యె తెలంగాణ.. గడ్డమీదకు నీళ్లెట్లెక్కుతయని ప్రతోడూ ఎక్కిరిచ్చినోడే.. అప్పటి ప్రాణహిత-చేవెళ్ల తెల్ల ఏనుగే.. ఎన్నటికీ మీకు నీళ్లు రావు.. ఎవుసం చేయలేరు అన్నోళ్లే.. సముద్రమట్టానికి 90 మీటర్ల ఎత్తునుంచి జారిపోతున్న గోదారి తల్లిని ఒడిసిపట్టుకొని ఎక్కడో.. 665 మీటర్ల ఎత్తుకు పరుగులు పెడుతుంటే.. ఎక్కిరించిన మొకాలు తెల్లబోయినయి.. దశాబ్దాల తరబడి నెర్రెలిచ్చిన నేలలు పచ్చగ కనపడుతుంటే.. చూడటానికి ఆ కండ్లు చాలటమే లేదు.

మహానాయకుడి దార్శనిక ఆలోచనతో గోదారి గంగమ్మ ఎదురు నడిచింది. ఎత్తెత్తుకు ఎగిరెగిరి దుంకింది. కాళేశ్వరుడి పాదాలను కడిగి నడక మొదలుపెట్టిన గంగమ్మ.. లక్ష్మి, పార్వతి, సరస్వతిగా ముగ్గురమ్మల రూపాలు ధరించి.. రంగనాయకుడిని అభిషేకించి కొమురెల్లి మల్లన్న సిగలోకి చేరింది. రాష్ర్టానికి ఉత్తరాన పోయే గోదారమ్మ నడిమధ్యకు వచ్చి.. తెలంగాణ రైతు నగుమోము చూచింది.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన కాళేశ్వర మహా యజ్ఞానికి ఇవాళ పరిపూర్ణత లభించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టం ఇవాళ ఆవిష్కారమవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనది.. 50 టీఎంసీల అతి పెద్దదైన రిజర్వాయర్‌ మల్లన్నసాగరం మహాసముద్రమై.. అపర భగీరథుడి పవిత్ర హస్తాల మీదుగా తెలంగాణ జాతికి సమర్పణం కాబోతున్నది.

మల్లన్నసాగర్‌ నేడు జాతికి అంకితం
చంద్రశేఖరుడు స్వప్నించిన సుజల దృశ్యం

మిట్టలెక్కి యెక్కి గుట్టలు దిగజారి
త్రోవ గడచి వచ్చినావు నీవు
మిగుల శ్రమలు గొన్న మిసిమింతురాలవు
సేదదీరుమీ ప్రసిద్ధ భూమి

అంటూ నిజాంసాగరంలో గుంభనంగా నిలిచిన గోదావరిని చూసి మహాకవి దాశరథి మురిపెంగా చెప్పారు. ఖమ్మంలో పారే కిన్నెరసాని హొయల గురించి కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ఏకంగా కావ్యమే రాశారు. ఇప్పుడు బతికిఉంటే.. పాతాళం నుంచి శిఖరానికి ఎగబాకిన గోదారి సోయగాన్ని విశ్వనాథ ఏమని వర్ణించే వాడో..! నదిని సాగరంగా మార్చిన అపర భగీరథుడు కేసీఆర్‌ను దాశరథి ఏమని వర్ణించే వాడో!

మల్లన్న విశ్వరూపం

– రిజర్వాయర్‌ కట్ట ఎత్తు 60 మీటర్లు
– కట్ట వెడల్పు 440 మీటర్లు
– కట్ట పొడవు 22.4 కిలోమీటర్లు
– రాతి కట్టడం 27 లక్షల క్యూబిక్‌ మీటర్లు
– కట్టకు వాడిన మట్టి 14.36 లక్షల క్యూబిక్‌ మీటర్లు
– ఆనకట్టకు 5 ఓటీ స్లూయిస్‌లు(తూములు)
– జలాశయం పూర్తి సామర్థ్యం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) + 557 మీటర్లు (50 టీఎంసీలు)
– 532 మీటర్ల వరకు (10 టీఎంసీలు) నీటి నిల్వ.. ఇది డెడ్‌ స్టోరేజీ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat