చిలకడదుంప తింటున్నారా?.. అయితే ఇది మీకోసమే..చదవండి.చిలకడదుంపతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో విటమిన్-A పుష్కలంగా లభిస్తుంది. దీంతో పాటు విటమిన్ B-6, C, మెగ్నీషియం, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. దీనిలో ఉండే ఫైబ్రినోజేన్ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. పొటాషియం హార్ట్ బీట్ ను క్రమబద్ధీకరిస్తుంది. చిలకడదుంప కంటి చూపును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.