శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వెస్టిండీస్ జరిగిన క్రికెట్ సిరీస్ లో అదరగొట్టి, మంచి ఫామ్ లో ఉన్న యువ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ గాయంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నిన్న ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పటికే ప్రధాన పేసర్ దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా శ్రీలంకతో సిరీస్ ఆడట్లేదు. అయితే మరోవైపు గురువారం టీమిండియా శ్రీలంకల మధ్య తొలి టీ20 జరగనుంది.
